మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో అధునాతన సదుపాయాలతో ఏర్పాటు చేసిన ‘స్టార్ ఫిట్నెస్ స్టూడియో’ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి స్టూడియోను ప్రారంభించారు. కేవలం ప్రారంభించడమే కాకుండా.. ప్రీతీ రెడ్డి స్వయంగా జిమ్‌లోని ఆధునిక పరికరాలపై వివిధ వ్యాయామాలు చేయడంతో పాటు బాక్సింగ్ గ్లోవ్స్ ధరించి బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేటి యంత్ర జీవనశైలిలో శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయాన్ని ఫిట్నెస్ కోసం కేటాయించాలని నిర్వాహకులు కోరారు. ఈ స్టూడియోలో బాక్సింగ్ శిక్షణతో పాటు ఆధునిక జిమ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
