నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం నియామకం

నిజామాబాద్, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలిపారు. మున్నూరు కాపు సంఘం సమావేశంలో సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చించి పలువురిని వివిధ బాధ్యతల్లో నియమించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా సుగంధం మురళి, సుగంధం సతీష్, ఆది రేఖుల సాయిలు, సోమినేని రాజేందర్, ఇంతు సత్యజీత్, ఇంతు ప్రవీణ్ కుమార్, ముహూర్ నవీన్ కుమార్, నాయికవాడ్ జగన్నాథ్, మల్లయ్య సుదర్శన్, పెద్గంగండి రవీంద్ర స్వామి తదితరులను నియమించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.మహిళా విభాగంలో మమత లావణ్య, మమత మంజుల సునీత, మమత చంద్రకళలకు బాధ్యతలు అప్పగించారు.

యువజన విభాగంలో సుధం హరీష్, ఈశ్వర్ శ్రీధర్, కొడవలి రణధీర్, ఉల్లెంగ నారాయణ్ తదితరులను నియమించినట్లు తెలిపారు.మున్నూరు కాపు సంఘం బలోపేతానికి, సభ్యుల సంక్షేమానికి, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు నూతన కార్యవర్గం కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు ధర్పురి సంజయ్ ఆకాంక్షించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులను పలువురు అభినందించారు.

– E6TV NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *