ఎల్లారెడ్డి, అక్టోబర్ 09 (E6tv NEWS: ప్రతినిధి).
ఎల్లారెడ్డి మండలంలోని కట్టకింది తండా (హజీపూర్) పరిధిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేయడంతో పాటు, మన సంస్కృతిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మౌనిక, ఉపాధ్యాయురాలు కల్యాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

