చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులకు శ్రీకారం
ఎల్లారెడ్డి, అక్టోబర్ 25 (E6tv న్యూస్).
ఎల్లారెడ్డి పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జన్ముల సుజాత, కొర్న పోచమ్మలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం సంతోషకరమని అన్నారు. సొంత ఇల్లు కలిగి ఉండాలనే పేద ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు ప్రశాంత్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా అర్హులైన కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరాలని ఆకాంక్షించారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. తమ సొంత ఇంటి కల నెరవేరే దిశగా అడుగులు పడటంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.
