ఎస్సారెస్పీ సబ్ కెనాల్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

మృతురాలి వయస్సు 40–45 ఏళ్ల మధ్య ఉండవచ్చని అంచనా.. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ (E6tv న్యూస్).

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదూరు గ్రామ శివారులో ఉన్న ఎస్సారెస్పీ సబ్ కెనాల్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కాలువ నీటి ప్రవాహంలో మృతదేహం కొట్టుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మృతురాలి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆమె ఎరుపు రంగు జాకెట్, ఎరుపు, పసుపు రంగు పూలతో కూడిన చీర ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.మృతురాలిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఆమెకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు లేదా ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసిన వారు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు:

  • ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ: 8712656795
  • మెట్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్: 8712656819

మృతురాలి గుర్తింపు కోసం ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఘటనకు సంబంధించి తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

E6tv NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *