Breaking News

విశాఖలో క్రిప్టో మోసం: రూ. 20 లక్షలు స్వాహా!

విశాఖపట్నానికి చెందిన 28 ఏళ్ల ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌కు గురై రూ. 20 లక్షలు కోల్పోయారు. వాట్సాప్ ద్వారా పరిచయమైన ఖుషీ అనే మహిళ, తను థోర్న్‌స్టన్ అండ్ రాస్ సంస్థలో ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని, ప్లాట్‌ఫారమ్ ద్వారా క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నానని చెప్పింది. ట్రేడింగ్ ప్రాఫిట్స్ స్క్రీన్‌షాట్లు చూపి నమ్మించడంతో, బాధితుడు మొదట ఆగస్టు 2026లో రూ. 60,000 పెట్టుబడి పెట్టగా యాప్‌లో రూ. 4,000 లాభం చూపించింది. ఆపై మరింత లాభాల ఆశ చూపడంతో విడతల వారీగా రూ. 20 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఈ మొత్తాన్ని ‘OnRamp’ యాప్ ద్వారా టెథర్ (USDT) క్రిప్టోగా మార్చి నెటోబిట్ వ్యాలెట్‌కు బదిలీ చేశాడు. ప్లాట్‌ఫారమ్‌లో లాభాలు రూ. 58 లక్షలుగా చూపించినా, విత్‌డ్రా చేసుకోవడానికి అదనంగా 15% ప్రొసెసింగ్ ఫీజు (రూ. 9 లక్షలు) కట్టాలని డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించి వైజాగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *