హార్టీకల్చర్ హబ్‌తో రాయలసీమ అభివృద్ధి: మంత్రి సవిత

రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్‌.. అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు శ్రీకారం

పులివెందులలో భారీ ట్రాక్టర్ ర్యాలీ.. స్వయంగా ట్రాక్టర్ నడిపిన మంత్రి

పులివెందుల/కడప: సెప్టెంబర్ 30 (E6tv NEWS: ప్రతినిధి).

రాయలసీమలో రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయనున్న హార్టీకల్చర్ హబ్‌తో ఉద్యానవన సాగులో ప్రాంతం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత తెలిపారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మదనపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు హార్టీకల్చర్ హబ్‌కు శ్రీకారం చుడతారని మంత్రి తెలిపారు. హార్టీకల్చర్ హబ్ ఏర్పాటును స్వాగతిస్తూ బుధవారం పులివెందులలో మంత్రి సవిత నేతృత్వంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవితో కలిసి మంత్రి సవిత మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సాగునీటి ప్రాజెక్టులతో పాటు పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించిందని తెలిపారు.రూ.లక్ష కోట్లతో ప్రతిపాదించిన హార్టీకల్చర్ హబ్‌లో ప్రపంచ బ్యాంకు నుంచి రూ.30 వేల కోట్లు, కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా రూ.60 వేల కోట్లు సమకూరనున్నాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

పులివెందులలో కూటమిదే విజయం: మంత్రి సవిత

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవి మాట్లాడుతూ.. పులివెందుల నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.అనంతరం టీడీపీ కార్యాలయం నుంచి మినీ కార్యాలయం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం టీడీపీ కార్యాలయం నుంచి మినీ కార్యాలయం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *