అర్ణబ్ తుపాను ఎఫెక్ట్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు

బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన ‘అర్ణబ్’ తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. తుపాను కారణంగా ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు కీలక రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, చర్లపల్లి వంటి ప్రధాన స్టేషన్ల నుంచి కోస్తాంధ్ర, ఒడిశా వైపు వెళ్లే హౌరా, భువనేశ్వర్, విశాఖపట్నం, కాకినాడ, నర్సాపూర్ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా నిలిపివేశారు. రైలు పట్టాలపై నీరు నిలవడం, సిగ్నలింగ్ సమస్యల వంటి ముప్పును తప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన అధికారులు.. ప్రయాణికులు బయలుదేరే ముందు NTES యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ రైలు స్టేటస్ చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *