Breaking News

బాధితుడి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ

రుద్రూరు, అక్టోబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి).

బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఫోన్ చేసి తన కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారని రుద్రూరుకు చెందిన బాధితుడు తెలిపారు. బోధన్ మండలం రాంపూర్ గ్రామానికి సంబంధించిన కేసు వివరాలతో పాటు, రుద్రూరు మండల కేంద్రంలో తనపై నమోదైన కేసుల గురించి ఆయనకు వివరించినట్లు పేర్కొన్నారు.

గతంలో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, రౌడీషీట్ వ్యవహారంలోనూ తనకు అన్యాయం జరిగిందని ఎండల లక్ష్మీనారాయణకు వివరించినట్లు తెలిపారు. తనను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేశారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించినట్లు చెప్పారు. ఈ అంశాలపై మాజీ ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా బోధన్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తనకు సంబంధించిన కేసులో 18 రోజుల పాటు రిమాండ్‌కు పంపిన విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో అక్బర్‌నగర్ గ్రామ పెద్దలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరారని, అనంతరం ఎమ్మెల్యే పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని వివరించినట్లు చెప్పారు. గ్రామ పెద్దలు, ఎమ్మెల్యే తనకు అండగా నిలిచి న్యాయం జరిగేలా సహకరించారని పేర్కొన్నారు.

గతంలోనూ తనపై నమోదైన కేసులు, రౌడీషీట్ వ్యవహారంలో తనకు జరిగిన అన్యాయంపై మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణతో పాటు బీజేపీ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు పెనుమర్తి దొరబాబు పోరాటం చేశారని గుర్తుచేశారు. పలు సభలు, కార్యక్రమాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.

తన కష్టసుఖాలను ఫోన్ చేసి అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణకు పాదాభివందనాలు తెలియజేస్తున్నానని, గతంలో తనకు అండగా నిలిచిన పెనుమర్తి దొరబాబుకు సైతం కృతజ్ఞతలు తెలుపుతున్నానని బాధితుడు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *