విజయ్ ఆస్తుల వివాదంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన ఆస్తుల వివరాలపై నేడు మద్రాస్ హైకోర్టులో విచారణ జరగనుంది. అఫిడవిట్‌లో విజయ్ సుమారు రూ.600 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించినప్పటికీ, మరో రూ.30 కోట్ల విలువైన ఆస్తుల (బంగ్లా మొదలైనవి) వివరాలను దాచిపెట్టారని ఒక పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. విజయ్ తన ఆస్తుల సమాచారాన్ని సరిగా వెల్లడించనందున ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు.

అయితే, కేవలం ఈ ఆరోపణల ఆధారంగా ఆయనను అనర్హుడిగా ప్రకటించలేమని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడినట్లు సమాచారం. ఇప్పటికే రూ.600 కోట్ల ఆస్తులను ప్రకటించిన వ్యక్తి, కొన్ని ఆస్తుల వివరాలు వదిలేస్తే అది చట్టప్రకారం ఓటర్లను ప్రభావితం చేసే తీవ్రమైన నేరం (Corrupt Practice) అవుతుందా లేదా అనే అంశంపై న్యాయస్థానం క్లారిటీ కోరింది. పిటిషనర్ విసిరిన సవాళ్లు, విజయ్ తరఫు న్యాయవాదులు వినిపించే వాదనలపై విచారణ జరిపిన అనంతరం హైకోర్టు తన తుది నిర్ణయాన్ని వెలువరించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *