నామినేషన్ల వేళ ఉద్రిక్తత:వైసీపీ, టీడీపీ శ్రేణులు మధ్య రాళ్ల దాడి

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, రాయచోటిల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు దిగాయి. రాయచోటిలో కొందరు ఆగంతకులు వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో కలిసి నామినేషన్లు వేసేందుకు వెళ్తుండగా, టీడీపీ శ్రేణులు కాన్వాయ్‌ను అడ్డుకుని దాడికి పాల్పడ్డాయని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ఇది తనపై జరిగిన హత్యాయత్నమని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. కాగా, ఈ ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసం కాగా కొందరికి గాయాలయ్యాయి. అక్కడ ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని విమర్శించిన వైఎస్సార్‌సీపీ, ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *