వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ నాయకత్వంలో ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో నాయకులు ‘ఓటు బచావో – దేశ్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును ఎస్ఐఆర్ పేరుతో తొలగించడానికి వీల్లేదని, ఓటర్ల జాబితాలో మార్పులు లేదా తొలగింపులు చేసేముందు ముందస్తు సమాచారం ఇచ్చి అభ్యంతరాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్‌లో ఇండియా కూటమి భారీ నిరసన..
