Breaking News

జంతర్ మంతర్‌లో ‘ఇండియా బియెన్నాలే 2026’

న్యూఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ ప్రాంగణాన్ని నిరసనల ప్రదేశం (Protest Site) జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఈ చారిత్రాత్మక వేదికను అంతర్జాతీయ స్థాయి కళా, వాస్తుశిల్ప, డిజైన్ ప్రదర్శనలకు వేదికగా ఉపయోగించేందుకు కేంద్ర సంస్కృతి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4, 2026 నుంచి మార్చి 21, 2027 వరకు నిర్వహించనున్న ‘ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బియెన్నాలే (IAADB) 2026’ ప్రధాన వేదికలలో ఒకటిగా జంతర్ మంతర్‌ను ఎంపిక చేశారు.

1724లో జైపూర్ మహారాజా సవాయ్ జైసింగ్ II నిర్మించిన ఈ ఖగోళ పరిశోధనా కేంద్రాన్ని, దశాబ్దాలుగా అనేక ప్రజా ఉద్యమాలు మరియు నిరసనలకు కేంద్రబిందువుగా ఉపయోగిస్తూ వచ్చారు. తాజాగా ఈ ప్రాంతంలో నిరసనలపై ఆంక్షలు విధించి, ప్రదర్శనల స్థలంగా డీనోటిఫై చేసిన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. 2023లో ఎర్రకోటలో పరిమిత స్థాయిలో జరిగిన మొదటి ఎడిషన్ కంటే భిన్నంగా, ఈసారి జంతర్ మంతర్‌తో పాటు ఢిల్లీలోని పదుల సంఖ్యలోని చారిత్రాత్మక ప్రదేశాలలో భారత్‌తో పాటు 20కి పైగా దేశాల కళాకారులు పాల్గొనేలా ఈ బియెన్నాలేను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *