Breaking News

భారత్ vs వెస్టిండీస్: నేడు ఆఖరి వన్డే..

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్‌‌ వేదికగా జరగనుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లలో ఘనవిజయం సాధించిన టీమిండియా 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు పట్టుదలతో ఉంది.

సిరీస్ ఇప్పటికే వశమవ్వడంతో భారత మేనేజ్‌మెంట్ బెంచ్ బల నిరూపణకు, యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే దిశగా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. మరోవైపు వరుస ఓటములతో కుంగిపోయిన వెస్టిండీస్, ఈ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో చండీగఢ్ వేదికగా జరగనున్న ఈ పోరులో భారత్ క్లీన్‌స్వీప్ సాధిస్తుందో లేక కరేబియన్ టీమ్ బోణీ కొడుతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *