Breaking News

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి అదనపు బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రకారం, సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్‌ను పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించగా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్ బాధ్యతలు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల బాధ్యతలను నవీన్ మిట్టల్‌కు కేటాయించారు. హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ల అదనపు బాధ్యతలను అప్పగించారు.

అలాగే రెవెన్యూ (దేవాదాయ) శాఖ కార్యదర్శిగా శైలజ రామయ్యర్, రవాణా శాఖ కార్యదర్శిగా కె. ఇలంబర్తి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ముషారఫ్ అలీ ఫరూఖీ నియమితులయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా డాక్టర్ సంగీత సత్యనారాయణ, టీజీఎస్పీడీసీఎల్, టీజీరెడ్కో పూర్తి అదనపు బాధ్యతలను జితేష్ వి. పాటిల్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *