ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్, సింగపూర్ కేంద్ర మంత్రి కె. షణ్ముగం మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం తో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శన ఏర్పాట్లపై సింగపూర్ మంత్రి షణ్ముగం హర్షం వ్యక్తం చేశారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే ప్రపంచ ప్రసిద్ధ తిరుమల క్షేత్రంలో టిటిడి పరిపాలన, క్యూలైన్ల నిర్వహణ అత్యుత్తమంగా ఉందని కొనియాడారు. మంత్రి నారా లోకేష్‌తో కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.
కాగా, సోమవారం ఉదయం ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ, హీరో నారా రోహిత్‌లు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే.
