Breaking News

వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం

అర్హులైన ప్రతి ఒక్కరికీ కృత్రిమ అవయవాలు అందించడమే లక్ష్యం: పోచారం భాస్కర్ రెడ్డి

బాన్సువాడ, అక్టోబర్ 11: (E6tv NEWS).

వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడం, అవసరమైన ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే తన లక్ష్యమని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని అంగవైకల్యం ఉన్న వారికి వారి అవసరాలకు అనుగుణంగా కృత్రిమ చేతులు, కాళ్లు, ఇతర సహాయక పరికరాలు అందించాలనే సంకల్పంతో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 30న బాన్సువాడ పట్టణంలో ముగ్గురికి కృత్రిమ అవయవాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి విస్తరించి, ఆర్థిక ఇబ్బందులతో కృత్రిమ అవయవాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించనున్నట్లు వెల్లడించారు.నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులకు ఆయన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తమ తమ గ్రామాల్లో అంగవైకల్యం ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వారి పూర్తి వివరాలు, ఫోన్ నంబర్, అంగవైకల్యానికి గల కారణం, అవసరమైన సహాయక పరికరాల వివరాలను సేకరించి అందించాలని కోరారు.నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులకు ఆయన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తమ తమ గ్రామాల్లో అంగవైకల్యం ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వారి పూర్తి వివరాలు, ఫోన్ నంబర్, అంగవైకల్యానికి గల కారణం, అవసరమైన సహాయక పరికరాల వివరాలను సేకరించి అందించాలని కోరారు.

దసరా పండుగ అనంతరం మండలాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అర్హులను గుర్తించి, వారికి సమాచారం అందించి, శిబిరాలకు తీసుకురావడంలో నాయకులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవసరమైన కృత్రిమ అవయవాలను పొందలేకపోతున్న వారికి చేయూతనిచ్చి, వారు ఆత్మవిశ్వాసంతో జీవనం కొనసాగించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోచారం భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఒక్కరు కూడా సహాయానికి దూరం కాకూడదు

మన చిన్న ప్రయత్నం ఒకరి జీవితంలో గొప్ప మార్పుకు నాంది కావచ్చని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వికలాంగుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *