Breaking News

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్‌స్వీప్.. కాంగ్రెస్‌కు గట్టి షాక్

కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం నాలుగు స్థానాలకు (రెండు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు) జరిగిన ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ-జేడీఎస్ (ఎన్డీయే) కూటమి క్లీన్‌స్వీప్ సాధించింది. ఇందులో బీజేపీ మూడు స్థానాలను, మిత్రపక్షం జేడీఎస్ ఒక స్థానాన్ని గెలుచుకోగా, కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. బెంగళూరు టీచర్స్ స్థానంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పుట్టన్నపై జేడీఎస్ అభ్యర్థి ఏపీ రంగనాథ్ 908 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మిగిలిన మూడు స్థానాల్లో నార్త్-ఈస్ట్ టీచర్స్ నుంచి శశిల్ జి.నమోషి, సౌత్-ఈస్ట్ గ్రాడ్యుయేట్స్ నుంచి కేఎం సురేశ్, వెస్ట్ గ్రాడ్యుయేట్స్ నుంచి ఎస్‌వీ సంకనూర్ (బీజేపీ) విజయం సాధించారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని ఎన్డీయే నేతలు పేర్కొనగా, ఇవి అసెంబ్లీలో ప్రభుత్వ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం చూపవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *