గుడి డిజైన్‌తో కూడిన కొత్త రూ. 1,000 నోటు త్వరలో చలామణిలోకి రానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పసుపు రంగులో టెంపుల్ మోటిఫ్‌తో ఉన్న ఒక నకిలీ నోటు ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో పీఐబీ దీనిపై స్పందించింది. కొత్త రూ. 1,000 నోటు జారీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి సోషల్ మీడియా వదంతులను ఎవరూ నమ్మవద్దని, అధికారిక వర్గాల ద్వారా మాత్రమే సమాచారాన్ని ధృవీకరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
కొత్త రూ. 1000 నోటు ప్రచారంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్: అదంతా ఫేక్
