ఈటల రాజేందర్ పాదయాత్రకు పోలీసుల బ్రేక్

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలనే డిమాండ్‌తో మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ తలపెట్టిన “మహా పాదయాత్ర”కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ రంగనాయక స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, నాలుగు రోజుల యాత్రను ప్రారంభించేందుకు సిద్ధమైన ఈటలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిబంధనల ప్రకారమే కమిషనర్‌కు లేఖ రాసి అనుమతి కోరానని, తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు తనకు ఉందని ఈటల స్పష్టం చేశారు. గతంలో ఇదే డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో మాట్లాడారని గుర్తుచేస్తూ, తాను అదే అంశంపై యాత్ర చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలీసుల నిరాకరణతో పాదయాత్ర కొనసాగింపుపై అనిశ్చితి ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *