తెలంగాణలో నిరంతర విద్యుత్ కోతలు, సాగునీటి కొరత వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్లముందే చేతికొచ్చిన వరి పంట ఎండిపోతుండటంతో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైపూర్ మండలం మిట్టపల్లిలో ఎండిపోతున్న పొలానికి ట్యాంకర్ల ద్వారా నీరు పారిస్తుండగా, వెల్గనూర్ గ్రామానికి చెందిన రైతులు కరెంట్ కోతలను తట్టుకోవడానికి డీజిల్ జనరేటర్లను సిద్ధం చేసుకుంటున్నారు. డీజిల్ ఖర్చు తమకు అదనపు భారంగా మారుతోందని, పంటల దిగుబడి తగ్గిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యం కల్పించి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
- Adilabad
- Breaking News
- Hyderabad
- Karimnagar
- Khamam
- Mahaboobnagar
- Medak
- Medchal
- Nalgonda
- News
- Nizambad
- Ranga Reddy
- Telangana
- Warangal
కరెంట్ కోతలు – నీటి ఎద్దడి: రైతులకు తప్పని పంట నష్టం భయం!
