Breaking News

టీచర్ పోస్టుల భర్తీపై రాహుల్ గాంధీ లేఖ:మధ్యప్రదేశ్‌

మధ్యప్రదేశ్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో లక్షకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, 2025 నోటిఫికేషన్‌లో వర్గం-2, వర్గం-3 పోస్టుల సంఖ్యను పెంచాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌కు ఘాటు లేఖ రాశారు. ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని, తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులపై నమోదు చేసిన కేసులను, పంపిన నోటీసులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఖాళీల సంఖ్య, పారదర్శక నియామకాలపై స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *