Breaking News

రమా నందన ఎమోషనల్ కామెంట్స్: సెప్టెంబర్ 7నాటి ఘటనపై..

‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా గుర్తింపు పొందిన యూట్యూబర్ రమా నందన పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన తన జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె చేసిన ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

విదేశీ ఉద్యోగాలు, వీసాల పేరుతో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. దీంతో సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో డెస్టినీ కన్సల్టెన్సీతో తనకు సంబంధం లేదని, అంతా తన భర్త మధుకర్ చూసుకుంటారని తెలిపిన ఆమె, తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాజా పోస్టులో “సెప్టెంబర్ 7న నేలపై కాలుమోపినప్పుడు నా జీవితంలో ఓ కఠిన పరిస్థితిని ఎదుర్కొన్నాను” అని మాత్రమే పేర్కొనడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *