పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి పన్ను సవరణ.. కొత్త టాక్స్లు ఇవే!

కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి సుంకం (ఎక్స్‌పోర్ట్ డ్యూటీ) రేట్లలో కీలక మార్పులు చేసింది. పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 0.5 నుంచి ఐదు రెట్లు పెంచి రూ. 2.5కి చేర్చగా, డీజిల్ ఎగుమతిపై లెవీని లీటరుకు రూ. 16 నుంచి రూ. 8.5కి తగ్గించింది. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతి సుంకం మాత్రం లీటరుకు రూ. 10.5 వద్దే యథాతథంగా కొనసాగుతోంది.

సవరించిన ఈ నూతన రేట్లు అక్టోబర్ 16 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పక్షం రోజులకోసారి ఈ ఎగుమతి సుంకాలను ప్రభుత్వం సమీక్షిస్తుంటుంది. అయితే, ఈ మార్పులు దేశీయంగా విక్రయించే పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరలపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *