Breaking News

లైసెన్స్ రద్దయినా మందుల విక్రయాలు?

లైసెన్స్‌ రద్దయినా మందుల విక్రయాలు కొనసాగుతున్నాయంటూ వచ్చిన కథనానికి ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ వేద ఎస్ఎస్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌ వ్యవహారంపై , లైసెన్స్‌ రద్దయినప్పటికీ మందుల విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కథనం ద్వారా విజ్ఞప్తి చేసింది.ఈ కథనంపై డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమవారం స్పందించారు. శ్రీ వేద ఎస్ఎస్ మెడికల్‌ స్టోర్‌ను తాను తనిఖీ చేయలేదని ఆయన తెలిపారు. అయితే, లైసెన్స్‌ రద్దయినప్పటికీ మందుల విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలపై తదుపరి చర్యలు ఏవిధంగా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న మందుల విక్రయాల విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ శాఖపై ఉంది. లైసెన్స్‌ రద్దయిన దుకాణాల్లో విక్రయాలు జరుగుతున్నాయా లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *