భారత రాయబార కార్యాలయం నుంచి NOC ప్రక్రియ పూర్తి.. కార్గో ఏర్పాట్లు పెండింగ్
జెడ్డా, సౌదీ అరేబియా (E6tv NEWS): సౌదీ అరేబియాలో సహజ మరణం చెందిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహమ్మద్ మజ్రుల్ హక్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) చొరవ తీసుకుంది. మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తికాగా, ప్రస్తుతం కార్గో ఏర్పాట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
మహమ్మద్ మజ్రుల్ హక్ ఇస్సామ్ కబ్బానీ గ్రూప్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన మృతి అనంతరం మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన పత్రాల సేకరణ, అధికారిక లాంఛనాల పూర్తి విషయంలో SATA ప్రతినిధులు సహకారం అందించారు.
ఈ క్రమంలో GTO జెడ్డా అధ్యక్షుడు, SATA ప్రతినిధి షౌకత్ అలీ సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ మరణ ధ్రువీకరణ పత్రం సహా అవసరమైన పత్రాల సేకరణకు కృషి చేశారు. అలాగే, అబ్దుల్ రఫీక్ చొరవతో భారత రాయబార కార్యాలయం నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (NOC) పొందే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన కార్గో ఏర్పాట్లు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ ఏర్పాట్లు పూర్తయిన వెంటనే మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ఈ క్లిష్ట సమయంలో సహకారం అందించిన షౌకత్ అలీ, అబ్దుల్ రఫీక్‌తో పాటు ఇతర సహకారులకు SATA బృందం కృతజ్ఞతలు తెలిపింది. మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.
SATA – హద్దులకు అతీతంగా మానవ సేవ.


