విమానాశ్రయంలా రూపుదిద్దుకుంటున్న ‘సికింద్రాబాద్‌’ రైల్వే స్టేషన్‌

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత కీలకమైన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ రూ.720 కోట్ల భారీ వ్యయంతో అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో అత్యాధునిక హంగులతో పునర్నిర్మాణమవుతోంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దశలవారీగా చేపట్టిన నిర్మాణ పనులు ఇప్పటికే 69 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను వేగవంతం చేసి జూన్ 2027 నాటికి స్టేషన్‌ను పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్టేషన్ పరిసరాల్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారంగా 6 అంతస్తుల భారీ మల్టీ-లెవల్ పార్కింగ్ బ్లాక్‌ను నిర్మిస్తున్నారు. అలాగే, సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లతో పాటు సిటీ బస్టాండ్ నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా స్టేషన్‌లోకి ప్రవేశించేలా స్కైవాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

రద్దీని నివారించేందుకు ప్లాట్‌ఫారమ్‌ల పైభాగంలో ‘రూఫ్ ప్లాజా’ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విశాలమైన సీటింగ్, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆటస్థలాలు, రిటైల్ షాపులు ఉంటాయి. స్టేషన్‌కు ఇరువైపులా ఉత్తర, దక్షిణ టెర్మినళ్లు శరవేగంగా రూపుదిద్దుకుంటుండగా, అక్కడ టికెటింగ్ కేంద్రాలు, వీఐపీ లాంజ్‌‌లు, ఆధునిక వెయిటింగ్ హాళ్లు రానున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం సోలార్ ప్యానెళ్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు మరియు సహజ వెలుతురు ప్రసరించేలా ఏరోడైనమిక్ రూఫింగ్ పనులను చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *