Breaking News

విజయవాడ 75వ డివిజన్: త్రివేణి రెడ్డి విస్తృత ప్రచారం!

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 75వ డివిజన్‌లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పేరం త్రివేణి రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే తన ముఖ్య ధ్యేయమని, స్థానిక డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

విద్యావంతురాలిగా, రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తిగా డివిజన్‌లోని మౌలిక సదుపాయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై తనకు పూర్తి స్పష్టత ఉందాని త్రివేణి రెడ్డి తెలిపారు. స్థానికులతో మమేకమవుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నానని, ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే 75వ డివిజన్‌ను మోడల్ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని అభ్యర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *