మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులను ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. రాజ్యాంగ సవరణకు మూడింట రెండొంతుల (కనీసం 360 మంది ఎంపీల) ప్రత్యేక మెజారిటీ అవసరం కావడంతో, ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్సభలో వీగిపోయిన ఈ బిల్లులను ఈసారి ఎలాగైనా నెగ్గించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్తో విభేదించి ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎంకేతో పాటు పలు ఇతర చిన్న పార్టీలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. అక్టోబర్ 26, 27 తేదీల్లో జరగనున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక సమావేశాల తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నారు.
