మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా యువత పోరాడాలి: రాహుల్ గాంధీ

దేశంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా యువత, ముఖ్యంగా ‘జెన్ జెడ్’ (Gen Z) వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. నేరస్థులను రక్షిస్తూ బాధితులనే తప్పుపట్టే ప్రస్తుత సమాజ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాడులు జరిగినప్పుడు మహిళల స్వేచ్ఛను హరించడం లేదా వారిని ఇళ్లకే పరిమితం చేయడం అత్యంత దారుణమైన చర్య అని, బాధితులకు శిక్ష విధించే ఈ పితృస్వామ్య మనస్తత్వాన్ని తుడిచిపెట్టాలని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

దక్షిణ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ సమీపంలో 16 ఏళ్ల బాలికపై జరిగిన దారుణాన్ని ప్రస్తావిస్తూ, నేరస్థులను కఠినంగా శిక్షించాల్సింది పోయి మహిళల కదలికలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. బీహార్, యూపీ, పంజాబ్ సహా దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం ఒత్తిడి వస్తేనే స్పందిస్తుందని, శాంతియుత నిరసనలు తెలిపే హక్కు యువతకు ఉందని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *