ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తి చేసిన తర్వాతే నిర్వహించాలంటూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ మధ్యంతర ఉపశమనం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తరఫు న్యాయవాది అత్యవసర విచారణ కోరగా, ప్రస్తుత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించడంపై ఎటువంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించిన కోర్టు, ఈ పిటిషన్ను శుక్రవారం (అక్టోబర్ 9న) విచారించేందుకు అంగీకరించింది. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కూడా అదే రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
స్థానిక ఎన్నికలపై సుప్రీంలో వైఎస్సార్సీపీ:ఏపీ
