01-04-2025 | మంగళవారం | తెలంగాణ
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిరక్షించాలి అనే డిమాండ్‌తో విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రధాన గేటు ఎదుట భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు.
ప్రధానాంశాలు:
- గచ్చిబౌలి భూమి అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల నిరసన
- ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు
- భూమి విక్రయాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్
ఈ నిరసనలో బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్ష నాయకులు కూడా పాల్గొనగా, వారు విశ్వవిద్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు జోక్యం చేసుకుని ప్రధాన గేట్లు మూసివేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనతో హెచ్‌సీయూ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Leave a Reply