తుని కోమటిచెరువు దగ్గర ఉద్రిక్తత – నారాయణరావు మృతి పై కుటుంబ సభ్యుల అనుమానం
తుని పట్టణంలోని కోమటిచెరువు సమీపంలో ఈ రోజు ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే సమయంలో మృతుడు నారాయణరావు కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది.
పోలీసులు ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులను పక్కకు లాగి మృతదేహాన్ని తరలించారు. ఈ సందర్భంగా నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేశారు.
నారాయణరావు సూసైడ్ చేయలేదని, ఇది అనుమానాస్పద మరణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, నలుగురు పోలీసులు వచ్చి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని వారు ఆరోపించారు.
సీఐ తెలిపిన ప్రకారం, రాత్రి 10.30 సమయంలో చెరువులో దూకి నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడని, ఉదయం 7 గంటలకు సమాచారం అందిందని చెప్పారు. అయితే, కుటుంబ సభ్యులు మాత్రం ఘటన జరిగిన వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనతో తుని ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
📰 E6TV స్పెషల్ రిపోర్ట్ – తుని నుండి

