Breaking News

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలు

ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్న విద్యార్థులు భద్రాచలం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) వినాయక చవితిని పురస్కరించుకుని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలను తయారు చేశారు. ఎకో క్లబ్, ఎన్‌ఎస్‌ఎస్, కల్చరల్ విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి ప్రతిమలను రూపొందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ.. మట్టి వినాయక ప్రతిమలను వినియోగించడం వల్ల నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు….

Read More

పేదలకు రూ.230కే సిమెంట్

తక్కువ ధరకే స్టీల్ అందించేందుకు చర్యలు: మంత్రి పొంగులేటి హైదరాబాద్,సెప్టెంబర్ 11:(E6tv NEWS). ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా పేదలకు సిమెంట్‌ను తక్కువ ధరకే అందించేలా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం రూ.310 నుంచి రూ.320 వరకు ఉన్న సిమెంట్ బ్యాగును లబ్ధిదారులకు కేవలం రూ.230కే అందించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్‌ను కూడా తక్కువ ధరకే…

Read More

హుజూర్‌నగర్‌లో సెల్ టవర్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం

నిర్మాణ పనులు నిలిపివేయాలని పురపాలక అధికారులకు వినతి హుజూర్‌నగర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి). హుజూర్‌నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఎదురుగా చేపడుతున్న ఎయిర్‌టెల్ సెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాలు, ఆసుపత్రికి సమీపంలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ హుజూర్‌నగర్ పురపాలక సంఘం కమిషనర్, చైర్మన్‌కు స్థానికులు వినతిపత్రం సమర్పించారు….

Read More

ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై రెడ్ వార్నింగ్ లేబుల్స్: FSSAI కి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

న్యూఢిల్లీ: ప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో (Packaged Foods) క్రొవ్వులు, చక్కెర, ఉప్పు వంటి హానికర పోషకాల మోతాదుపై వినియోగదారులను హెచ్చరించే ‘ఫ్రంట్-ఆఫ్-ప్యాకేజ్ లేబులింగ్’ (FoPL) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రతిపాదించిన దశలవారీ లేబులింగ్ విధానంపై మరిన్ని స్పష్టతలు ఇవ్వాలని జస్టిస్ జె.బి. ప్యాగీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కేవలం అక్షరాలతో కూడిన వార్నింగ్‌లు కాకుండా,…

Read More

బ్రిక్స్ సదస్సు వేళ కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు

న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యంలో 18వ ‘బ్రిక్స్’ (BRICS) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానున్న తరుణంలో, ఈ కూటమి వల్ల దేశానికి కలిగే ప్రయోజనాలపై కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిక్స్ వల్ల భారత్‌కు చేకూరిన స్పష్టమైన ప్రయోజనాలేమిటని సీనియర్ నేత పి. చిదంబరం ప్రశ్నించగా, మరో ఎంపీ శశి థరూర్ ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ కూటమి ప్రాధాన్యతను సమర్థించారు. ప్రపంచ జనాభాలో అత్యధిక వాటాతో పాటు గ్లోబల్ జీడీపీలో 41 శాతం వాటా కలిగి ఉన్న…

Read More

బీహార్‌లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి ప్రమాదం: 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

వైశాలి: బీహార్‌లోని వైశాలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన (బ్రిడ్జి) ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడ పనులు చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకోగా, స్థానికులు, అధికారులు వెంటనే స్పందించి వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, నాసిరకం మెటీరియల్ వాడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు…

Read More

టీవీకేకు రాష్ట్ర పార్టీ హోదా, ‘విజిల్’ గుర్తు కేటాయింపు

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) టీవీకేను రాష్ట్ర పార్టీగా అధికారికంగా గుర్తించడంతో పాటు, పార్టీకి ‘విజిల్’ (Whistle) గుర్తును కేటాయించింది. మరోవైపు అక్టోబర్ 6న జరగనున్న ఉప ఎన్నికల కోసం టీవీకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మదురాంతకం నియోజకవర్గం నుంచి కె. మరగతం కుమరవేల్‌, ధారాపురం నుంచి…

Read More

న్యూఢిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్:18వ బ్రిక్స్ సదస్సు

న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో వ్లాదిమిర్ పుతిన్ కీలక ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. భారత్-రష్యా మధ్య రక్షణ, ఇంధనం, వాణిజ్యం మరియు వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై ఇరు నాయకులు చర్చించనున్నారు. ఈ…

Read More

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

కొత్తగూడెం, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఆమె చిత్రపటానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా…

Read More

ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి ‘సై’

శిల్పినగర్, కేజీబీవీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం భద్రాచలం ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు భద్రాచలం, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థి కేంద్రంగా బోధన అందిస్తున్నామని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు. శిల్పినగర్ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ భద్రాచలం విద్యార్థులు చురుకుగా, ఉత్సాహంగా విద్యను అభ్యసిస్తూ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి తాము సైతం సిద్ధమంటున్నారని తెలిపారు. గురువారం భద్రాచలం పట్టణంలోని శిల్పినగర్…

Read More