Breaking News

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష

మద్నూర్: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మద్నూర్ ఎస్‌ఐ మోహన్‌రెడ్డి హెచ్చరించారు. మద్నూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఆరుగురు పట్టుబడ్డారు. పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను బిచ్కుంద కోర్టు–II మేజిస్ట్రేట్ చంద్రకళ ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.500 చొప్పున జరిమానా, మరో ముగ్గురికి ఒక్కొక్కరికి రెండు…

Read More

ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీలు

24 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీ లాంటి వారని, వారి మార్గదర్శకత్వంలో విద్యార్థులు తమ ప్రతిభను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతారని నల్గొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. రమాదేవి అన్నారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జె.బి. బాలు ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్‌లో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమం…

Read More

పాల్వంచ–కొత్తగూడెం వేదికగా జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్

ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహణకలెక్టర్, ఎస్పీలకు ఆహ్వానం పలికిన జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కొత్తగూడెం, సెప్టెంబర్ 12: (E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం వేదికగా ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి తెలిపారు. శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్లా సురేష్‌రెడ్డి సహకారంతో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో దేశంలోని వివిధ…

Read More

గ్రామగ్రామాన గణేషుడు.. 300కు పైగా విగ్రహాల ఉచిత పంపిణీ

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో గణేష్ ఉత్సవాల సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఓజో ఫౌండేషన్ అధినేత, బీఆర్‌ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని భక్తులకు 300కు పైగా గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.భక్తి, సేవ, ఐక్యత అనే స్ఫూర్తితో ప్రతి గ్రామంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత, భక్తులు…

Read More

యోగ సేవలకు గుమలాపురం సత్యనారాయణకు సన్మానం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేత భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). యోగ రంగంలో విశేష సేవలు అందిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి, పట్టణ ప్రముఖ యోగా గురువు గుమలాపురం సత్యనారాయణను కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. తెలంగాణ యోగ టీచర్స్ కోఆర్డినేట్ కమిటీ (TYTCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సన్మానం జరిగింది.యోగ ద్వారా ప్రజలకు ఆరోగ్యం, ఆనందంతో పాటు…

Read More

పినపాక నియోజకవర్గానికి రూ.186 కోట్ల హెచ్‌ఏఎం నిధులు

బీటీ రహదారులు, వంతెనల అభివృద్ధికి భారీగా నిధుల మంజూరు దసరాలోపే పనులు ప్రారంభం.. 15 ఏళ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే పినపాక, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) పినపాక నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. నియోజకవర్గంలోని బీటీ రహదారులు, వంతెనలు, బ్రిడ్జిల నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం హెచ్‌ఏఎం నిధుల నుంచి సుమారు రూ.186 కోట్లు మంజూరైనట్లు పినపాక ఎమ్మెల్యే తెలిపారు. మంజూరైన నిధులతో నియోజకవర్గంలోని అవసరమైన రహదారులు, వంతెనల అభివృద్ధి…

Read More

పలు దశదిన కర్మల్లో పాల్గొన్న కొత్వాల

పాల్వంచ, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). పాతపాల్వంచ షిర్డీసాయిబాబా దేవాలయం ధర్మకర్త, కేటీపీఎస్ ఫోర్‌మెన్, కార్మిక నాయకుడు ముత్యాల కోటేశ్వరరావు దశదిన కర్మల్లో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, మార్క్‌ఫెడ్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. శనివారం పాతపాల్వంచ గడియకట్టలోని కోటేశ్వరరావు స్వగృహానికి కొత్వాల శ్రీనివాసరావు, 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి దంపతులు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోటేశ్వరరావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి,…

Read More

16వ వార్డులో పారిశుధ్యంపై నిర్లక్ష్యం

అభివృద్ధికి నోచుకోని స్థితిలో వార్డు ప్రజలు: పుల్లూరి ప్రశాంత్ జమ్మికుంట, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పారిశుధ్య నిర్వహణపై అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి, సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ ఆరోపించారు. వార్డులో వీధులు సక్రమంగా శుభ్రం చేయడం లేదని, రోడ్ల వెంట పెరిగిన పచ్చిక గడ్డిని తొలగించడం లేదని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదని పేర్కొన్నారు.వార్డులో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో…

Read More

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం: బీఆర్ఎస్ ధరణి భూదందా

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములను ఆక్రమించిందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శాసనసభలో 22-ఏ నిషేధిత భూములపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రజల భూములు మరియు ఆస్తులకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వ రెవెన్యూ సంస్కరణల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ రెవెన్యూ శాఖను తన వద్దే…

Read More

రేవంత్ రెడ్డిపై కవిత సంచలన ఆరోపణలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని మండిపడిన ఆమె, ఈ నెల 20న ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించి ఆయన అవినీతి పాపాల చిట్టాను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని ‘బ్లాక్‌మెయిలర్ల సంఘానికి అధ్యక్షుడు’గా అభివర్ణించిన కవిత, గతంలో ఆర్టీఐ చట్టాన్ని ఆసరాగా చేసుకుని రియల్…

Read More