పద్ధతి మార్చుకోని రాజేంద్రప్రసాద్… మళ్లీ వివాదాల దారిలో!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దశాబ్దాలుగా వినోదానికి చిరునామాగా నిలిచిన నటుడు రాజేంద్రప్రసాద్, గత కొంతకాలంగా తన ప్రవర్తనతో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
యువకుడిగా ఉన్నప్పుడు హుందాతనం, పద్ధతి, మాట్లాడే తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. అయితే తాజాగా ఆయన మాట్లాడే విధానం, స్టేజ్‌పై ప్రవర్తన — పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ చర్చనీయాంశమవుతోంది.

ఇటీవల నితిన్–శ్రీలీల జంటగా నటించిన “రాబిన్‌హుడ్” ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి.
ఆ సినిమా స్పెషల్ క్యామియో చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ, ఆయనను “పిచ్చి ముం** కొడుకు” అంటూ సంబోధించడం సినీ వర్గాల్లో షాక్ ఇచ్చింది.

అంతే కాదు, ఆ తర్వాత మరో ఈవెంట్‌లో కమెడియన్ అలీ గురించి మాట్లాడుతూ కూడా అవమానకర పదజాలం వాడారు.
దీనిపై అలీ స్పందిస్తూ — “రాజేంద్రప్రసాద్ గారు కూతురు మరణం తర్వాత మానసిక ఆవేదనలో ఉన్నారు, అందుకే అలా మాట్లాడి ఉంటారు” అని చెప్పారు.
దీనికి రాజేంద్రప్రసాద్ కూడా స్పందిస్తూ, “అలీతో ఉన్న చనువు వల్లే అలా అన్నాను” అని వివరణ ఇచ్చుకున్నారు.

ఈ వివాదాల నడుమ మరోసారి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు దృష్టిని ఆకర్షించాయి.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ — “ఈ రోజుల్లో హీరోలు మారిపోయారు… ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారిని హీరోలా చూపిస్తున్నారు” — అని వ్యాఖ్యానించారు.
దీంతో ఆయన ‘పుష్ప’ సినిమాపై పరోక్షంగా వ్యాఖ్యానించారని భావించిన అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు.

కొంతకాలం మీడియాలో దూరంగా ఉన్న రాజేంద్రప్రసాద్ తాజాగా ‘మాస్ జాతర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హాజరై మళ్లీ హైలైట్ అయ్యారు.
ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించగా, ఈవెంట్‌లో హీరో రవితేజ ఆయనతో పని చేసిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ, “రాజేంద్రప్రసాద్ గారితో పని చేయడం ఎప్పుడూ ఎనర్జీ ఇస్తుంది” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *