మరోసారి పల్లె పండుగ 2.0

ఒకే సారి గ్రామాల్లో 52 వేల పనులు!

పవన్ కల్యాణ్ పాలనలో గ్రామీణాభివృద్ధి కొత్త దిశలో సాగుతోంది.
ఇప్పటికే పల్లె పండుగ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం, ఇప్పుడు పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తోంది.
గ్రామాల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, 6,500 కోట్ల రూపాయలతో 52 వేల పనులు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
రహదారుల నిర్మాణాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 52 వేల పనులకు శ్రీకారం చుట్టి గ్రామాల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నెలాఖరు లేదా వచ్చే నెల ప్రారంభంలో కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన పల్లె పండుగ 1.0 కార్యక్రమంలో రూ.2 వేల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు.
రోడ్లు, కాలువలు, గోకులాల నిర్మాణాలు, సిమెంట్‌ రోడ్లు, తారురోడ్లు — మొత్తం 4 వేల కిలోమీటర్ల మేర అభివృద్ధి చేశారు.

ఇప్పుడు పల్లె పండుగ 2.0లో
ఉపాధిహామీ పథకం, నాబార్డు, పీఎం గ్రామీణ సడక్ యోజన, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (AIIB), 15వ ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీల సాధారణ నిధులు — అన్నీ సమన్వయంతో వినియోగించనున్నారు.

కేంద్రం నుండి త్వరలో రూ.2,500 కోట్ల మెటీరియల్ నిధులు విడుదల కానున్నాయి.
ఇక పెద్ద పంచాయతీల్లో ప్రజల అవసరాల మేరకు నిధులను వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పల్లె పండుగ 2.0లో 1,107 పంచాయతీల్లో 55 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు.
ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రెయిన్ల పనులను మిగతా పంచాయతీలకు విస్తరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *