అన్నా అంటే చాలు… భరోసా ఇచ్చిన కేటీఆర్!
రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన తన ప్రతిభతో దేశస్థాయిలో రాణిస్తూ, ఇప్పుడు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి భారత బృందంలో ఆమె చోటు దక్కించుకోవడం గర్వకారణంగా మారింది.
పేద కుటుంబంలో జన్మించిన అర్చనకు చిన్ననాటి నుంచి క్రీడలపై ఆసక్తి. ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల్లోనూ, అద్దె ఇంట్లో జీవిస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ, గెలుపే లక్ష్యంగా కృషి చేశారు. ఖేలో ఇండియా, నేషనల్ స్థాయిలో మెరిసిన ఆమె ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.
అర్చన పరిస్థితిని సోషల్ మీడియాలో గమనించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్), “నేనున్నానూ” అంటూ భరోసా ఇచ్చి, ఆమెకు అవసరమైన క్రీడా పరికరాలు, ఆర్థిక సాయాన్ని అందించారు. సామాన్యుల కోసం ఎప్పుడూ నిలిచే “రామన్న”గా మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు.

