అలీ రీ-ఎంట్రీ ఫిక్స్..? రాజకీయ వేదికపై మళ్లీ అలీ హడావిడి..!

సినీ నటుడు అలీ మళ్లీ రాజకీయ వేదికపైకి రాబోతున్నారా..? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారా..?
రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న అలీ, సినిమాలతో బిజీగా గడిపారు.
అయితే తాజాగా ఆయన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను కలవడం రాజకీయ చర్చలకు దారితీసింది.
వంశీ మోహన్‌తో ఆ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో,
అలీ రాజకీయ రీ-ఎంట్రీ పై ఊహాగానాలు మొదలయ్యాయి.

తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న అలీ,
తరువాత 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.
అయితే ఆ తర్వాత ఆయనకు పెద్ద పదవి దక్కలేదు — కేవలం ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారుగా నియమించబడ్డారు.

2024 ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున ప్రచారం చేసిన అలీ,
పార్టీ ఓటమి తర్వాత “తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు” అని ప్రకటించారు.
అయితే ఇప్పుడు వంశీ మోహన్‌ను కలవడంతో,
వైసీపీతో మళ్లీ కలిసే అవకాశాలపై రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.

వంశీ మోహన్ జైలు నుంచి బయటకు వచ్చి అనారోగ్యంతో ఉన్న సమయంలో అలీ మర్యాదపూర్వకంగా కలిశారని,
అది కేవలం వ్యక్తిగతంగా జరిగిన భేటీ అని కొందరు అంటున్నారు.
కానీ ఈ భేటీ రాజకీయ ఉష్ణోగ్రతను పెంచింది అనేది వాస్తవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *