హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి రోజురోజుకీ పెరుగుతోంది. నామినేషన్ల సమర్పణకు ఇవాళ చివరి గడువు రోజు కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను అధికారికంగా బరిలోకి దింపాయి. ఉదయం నుంచే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద రాజకీయ వాతావరణం వేడెక్కింది.
బీజేపీ తరఫున శ్రీ లంకల దీపక్ రెడ్డి గారు భారీ ర్యాలీతో వచ్చి తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధి, పారదర్శకత కోసం ఈ పోటీ చేస్తున్నాను,” అని తెలిపారు.

ఇక కాంగ్రెస్, బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) మరియు ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు సమర్పించారు. పలు ప్రాంతాల నుండి భారీగా కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలుగా తరలి రావడంతో ప్రాంతం అంతా రాజకీయ హడావుడితో మార్మోగిపోయింది.
ఎన్నికల అధికారులు సజావుగా నామినేషన్ల స్వీకరణ కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు ఇంకా కొంతమంది అభ్యర్థులు తమ పత్రాలు సమర్పించే అవకాశం ఉంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మక పోటీగా అభివర్ణిస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, రేపటినుంచి అభ్యర్థులు ముమ్మర ప్రచారంలోకి దిగనున్నారు.

