మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? – కేంద్రమంత్రి పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసన
మందడం గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నిరసన సెగ తగిలించారు.
మంత్రి నారాయణ సమక్షంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకుంటూ రైతు రామారావు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాన్ని రైతు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.
“మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు?” అంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కారణంగానే తమ బావ రామారావు మృతి చెందాడని ఆయన బామ్మర్ది ఆరోపించారు.
“పోయిన మనిషిని తీసుకొస్తారా?” అంటూ కేంద్రమంత్రిని నిలదీశారు.
“మీ సానుభూతి మాకు అక్కర్లేదు… వెళ్లిపోండి” అంటూ కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.
ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసన

