ప్రజా పాలన వారోత్సవాలు తెలంగాణ అభివృద్ధి

ప్రజా పాలన వారోత్సవాల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రతిపాదించింది , 2024 లో ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరపాలని ప్రకటించింది. దీనిలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఈ ప్రజా పాలన అనే 9 రోజుల కార్యక్రమాల్లో డిసెంబర్ 1న విద్యార్థులకి వ్యాసరచనా పోటీలు, క్రీడా కార్యక్రమాలు ఉంటాయి. డిసెంబర్ 2న ఆరో గ్యానికి సంబంధించిన నర్సింగ్, పారా మెడికల్ , ట్రాన్స్‌జెండర్ క్లినిక్లు మొదలైనవి ఉంటాయి. డిసెంబర్ 3-4 లలో అభివృద్ధి పనుల ప్రారంభం, నియామక పత్రాల పంపిణీ వంటి కార్యక్రమాలుంటాయి. డిసెంబర్ 7-9 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉత్సవాలు —కల్చరల్ షోలు, డ్రోన్‌షో, రాష్ట్ర వైభవాన్ని ప్రతిబింబించే వేడుకలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, వాటి ఫలితాలు ప్రజల ముందుకు వస్తాయి. ప్రజలకి ప్రభుత్వం ఏవిధంగా పని చేస్తున్నదో అనే సమాచారం అందుతుంది. ఉత్సవం రోజున ప్రజలు ఆయా ప్రాంతాల్లో పాల్గొనే అవకాశం ఉంటే, వారికి పాలనా విధానాల్లో ఆసక్తి, నిఘా భావన పెరుగుతుంది. ప్రజా పాలన వారోత్సవాలు తెలంగాణ అభివృద్ధి ప్రోత్సాహక చర్యల్లో భాగంగా కొత్త స్కూల్‌లు, క్లినిక్‌లకు శంకుస్థాపనలు ప్రారంభించడం ద్వారా నేరుగా ప్రజలకు సేవలు అందుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *