ఈనెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 18న వస్తారని భావించారు, అయితే రెండు రోజులు ముందుగానే రాష్ట్రానికి వస్తున్నారు. బిలేట్స్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులతో సమావేశం అవుతారు. పలు కీలక అంశాలపై సమీక్ష ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏఐ టెక్నాలజీని అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో బిలేట్స్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకోనుంది.
16న ఏపీకి బిలేట్స్

