
ఆస్తులకు సంబంధించిన కేసులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఆయన హాజరైనట్లు జగన్ లాయర్ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయానికి కోర్టుకు చేరుకున్న జగన్, కోర్టు హాల్లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండగా, కోర్టు ఆయన హాజరును రికార్డులో నమోదు చేసి విచారణను ముగించింది. ప్రస్తుతం మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని, తదుపరి ఉత్తర్వుల ప్రకారం మాత్రమే జగన్ తిరిగి కోర్టుకు వస్తారని లాయర్ తెలిపారు.
నాంపల్లి సీబీఐ కోర్టులో ముగిసిన వైఎస్ జగన్ విచారణ
దాదాపు అరగంట పాటు విచారించిన కోర్టు
కోర్టు నుంచి లోటస్ పాండ్లోని నివాసానికి వెళ్లిన జగన్
కోర్టు ఆదేశాల ప్రకారమే జగన్ హాజరయ్యారు : జగన్ లాయర్
జగన్ హాజరును కోర్టు రికార్డు చేసింది : జగన్ లాయర్
ప్రస్తుతానికి మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదు
తదుపరి ఉత్తర్వుల ప్రకారం జగన్ కోర్టుకు వస్తారు: జగన్ లాయర్

