Bigg Boss 9 Telugu: చివరి దశకు చేరిన షో, నిజాలను బయటపెట్టిన శ్రీజ దమ్ము | వీడియో వైరల్

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు బుల్లితెరపై మరోసారి హంగామా సృష్టిస్తోంది. ఈ సీజన్ మొదలైనప్పటి నుండి హోస్ట్ నాగార్జున రణరంగం అని చెప్పుతూ ప్రేక్షకుల్లో క్యూకియాసిటీ క్రియేట్ చేశారు. గత సీజన్లకు భిన్నంగా, ఈ సారి కామనర్స్ ని తీసుకొచ్చి అగ్నిపరీక్ష వంటి గేమ్స్ ద్వారా రియాల్టీ షోను మరింత ఆసక్తికరంగా మార్చారు.

ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు 9వ సీజన్ చివరి దశకు చేరింది. కొన్ని రోజుల్లో ఈ సీజన్ ముగిసేలా ఉంది. ప్రస్తుతం పదకొండవ వారంలో షో నడుస్తోంది. ఫ్యామిలీ వీక్ ఒక్కసారిగా ఆటలో భారీ మార్పు తెచ్చింది.

ముందు నుండే నెటిజన్స్ బిగ్ బాస్ ముద్దుబిడ్డ అని పిలుస్తున్న తనుజనే విన్నర్ అవుతారని భావిస్తున్నారు. అయితే ఫ్యామిలీ వీక్ తర్వాత, కళ్యాణ్ పడాల అనూహ్యంగా విన్నర్ రేస్ లోకి దూసుకువచ్చాడు. ప్రస్తుతానికి తనుజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ విన్నర్ రేసులో టాప్ పోజిషన్లలో ఉన్నారు. ఈ వారం దివ్య షో నుంచి బయటకు వెళ్ళనుండటం కూడా తెలుస్తోంది.

ఈ సీజన్ లో కామనర్ గా ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న శ్రీజ దమ్ము తాజాగా మరో షాకింగ్ వీడియో పోస్ట్ చేసింది. నిజానికి ఈ సీజన్ లో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ కారణం కూడా ఆమె అని అంటున్నారు. రీఎంట్రీ పేరుతో హౌస్ లోకి తీసుకువచ్చి మళ్లీ ఎలిమినేట్ చేసినప్పటికీ, రెండుసార్లా శ్రీజకు జర్నీ వీడియో ప్లే చేయలేదు.

శ్రీజ తన ఎలిమినేషన్ పై ఇప్పటికే సంచలన కామెంట్స్ చేసి, షో యొక్క నిజాలను బయటపెడుతూ రోజుకో వీడియో షేర్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bigg Boss 9 Telugu అభిమానులకు ఇది హై ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించే సీజన్, కానీ ఒకవేళ ఈ సీజన్ లోని అన్ఫెయిర్ మోమెంట్స్, ఎలిమినేషన్స్ గురించి తెలిసి, ప్రేక్షకుల్లో క్యూకియాసిటీ మరింత పెరుగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *