Satish Sampath

ప్రజా పాలన వారోత్సవాలు తెలంగాణ అభివృద్ధి

ప్రజా పాలన వారోత్సవాల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రతిపాదించింది , 2024 లో ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరపాలని ప్రకటించింది. దీనిలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ ప్రజా పాలన అనే 9 రోజుల కార్యక్రమాల్లో డిసెంబర్ 1న విద్యార్థులకి వ్యాసరచనా పోటీలు, క్రీడా…

Read More

ప్రైవేటీకరణ వద్దు.. విశాఖ స్టీల్ భవితవ్యం ఏంటి..?

ఏ ఉద్యోగి అయినా తప్పనిసరిగా పని చేయాలి. ఆ పనికి తగ్గట్టు వేతనం తీసుకోవాలి. అది ఎవరికైనా వర్తిస్తుంది కూడా. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఈ మాట ప్రధానంగా వినిపిస్తుంది. కానీ ఎక్కడ వివాదం చోటు చేసుకోదు. కానీ ప్రభుత్వ రంగంలో మాత్రం పనిచేయమంటే ఉద్యోగులకు కోపం. పనికి తగ్గట్టు వేతనం ఇస్తామంటే అక్కడ కుదరదని ఉద్యోగులు తేల్చి చెబుతారు. ఎందుకంటే అది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి. ప్రైవేట్ రంగంలో మరో మాటకు తావు ఉండదు. అలాగని…

Read More

Red Fort Bomber Selfie Viral Video

ఢిల్లీ బాంబ్‌ బ్లాస్ట్‌ కేసులో కీలక మలుపు వెలుగులోకి వచ్చింది. చాందినీ చౌక్ వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడుకు బాధ్యుడైన ఉగ్రవాది డాక్టర్ ఉమర్‌.. ఆ దాడికి ముందు చేసిన సెల్ఫ్ వీడియోను దర్యాప్తు అధికారులు విడుదల చేశారు. ఆత్మాహుతి దాడిపై సమాజంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని డాక్టర్ ఉమర్‌ వీడియోలో స్పష్టం చేశాడు. సుసైడ్‌ బాంబింగ్‌ చేయాలంటే ఆ వ్యక్తి అత్యంత భయంకరమైన మైండ్‌సెట్‌లోకి వెళ్లాల్సి ఉంటుందని, మరణమే తన అంతిమ లక్ష్యంగా భావించాల్సి…

Read More

రాజమౌళి పై కేసు

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రీయ వానరసేన అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదును అందజేసింది. వారణాసి సినిమా టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపించింది. ఆ ఫిర్యాదులో వానరసేన సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు. ఇటీవల సినిమాల్లో హిందూ దేవతలను కించపరిచే ధోరణి పెరిగిందని.. మత విశ్వాసాలను దెబ్బతీయడం…

Read More

ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీకి CEO అని తెలుసా..!

ఐబొమ్మ వెబ్‌ సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 2019 నుంచి భారీ నెట్‌వర్క్‌ను నడుపుతూ వేలాది సినిమాలను పైరసీ చేసి.. ఇండస్ట్రీకి సుమారు రూ.3,000 కోట్ల నష్టం కలిగించిన ప్రధాన నిందితుడిగా రవిని గుర్తించారు. కాగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. విచారించిన జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రవిని చంచల్…

Read More

అఖండ 2’నుంచి ఫస్ట్ సింగిల్.. బాలయ్య విశ్వరూపం

నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు వినగానే వచ్చే ఎలక్ట్రిక్ జోష్‌… మాస్ వైబ్‌… పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, రక్తం మరిగించే డైలాగులే గుర్తుకొస్తాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలున్నా బాలయ్య లాంటి మాస్ ఇమేజ్ మరొకరికి లేదంటే అతిశయోక్తి ఉండదేమో. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, రౌద్ర నృసింహం లాంటి స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ పంథాలో బోయపాటి శ్రీను చూపే దుమ్ము రేపే ట్రీట్‌ ఈ రెండు శక్తులు కలిసినపుడు వచ్చే తుఫాన్ మామూలుగా…

Read More

ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్.. అసలు బొమ్మ చూపించిన పోలీసులు

దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్”.. అనే డైలాగ్ పుష్ప 2లో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అయితే ఇదే రేంజ్‌లో తెలంగాణ పోలీసులకి గతంలో ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే మా దగ్గరున్న ఎంతోమంది సమాచారాన్ని లీక్ చేస్తామంటూ పోలీసులకే ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు ఐబొమ్మ నిర్వాహకులు. అయితే ఈ వార్నింగ్‌ని అంతే సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అప్పటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుల్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి…

Read More

ఆళ్లకు జగన్ షాక్..?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం వెంటాడుతోంది. కేసులతోపాటు అరెస్టులు జరుగుతుండడంతో దూకుడు కలిగిన నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు కూడా భయపడిపోతున్నారు. వైసీపీ హయాంలో రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి.. ఒక ఆట ఆడేసుకున్న నేతలు సైతం ఇప్పుడు కనిపించకుండా పోతున్నారు. అటువంటి వారిలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి. ఈ ఇద్దరు…

Read More

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఎలాంటి నేరం కింద అరెస్టు చేసినా సరే, ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా, నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణం 22(1) ప్రకారం.. అరెస్టు చేసిన వ్యక్తికి అరెస్టు కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలనే అంశాన్ని…

Read More

200 ఐఈడీ బాంబులతో దేశవ్యాప్తంగా పేలుళ్లు… ఉగ్రవాదుల కుట్ర!

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది కేవలం ఒక్క చోటుకే పరిమితమైన దాడి కాదని, 26/11 ముంబయి తరహాలో దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) బాంబులను సిద్ధం చేసే పనిలో ఉగ్రవాదులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం,…

Read More