Satish Sampath

తెలంగాణలో పెరిగిన చలి!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరగడంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. కొమురం భీం- ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ యూ,లో బుధవారం రాత్రి అత్యంత కనిష్ఠంగా 10.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి హెచ్‌సీయూ ప్రాంతంలో 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో సగటున…

Read More

పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు

సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ వివాహ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. పెళ్లికి కూడా ఓ ‘ఎక్స్‌పైరీ డేట్’ (గడువు తేదీ), ‘రెన్యువల్ ఆప్షన్’ (పునరుద్ధరణ అవకాశం) ఉండాలని ఆమె పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా 26 ఏళ్లుగా వైవాహిక బంధంలో కొనసాగుతున్న ఆమె ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి నిర్వహిస్తున్న ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్…

Read More

ఏ ఫ్రాంచైజీ ఎవరిని తీసుకుంటుందో..

ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. నవంబర్ 15 ఆటగాళ్ల రిటెన్షన్‌కు ఆఖరి తేదీ కావడంతో ఫ్రాంచైజీలన్నీ ఆ పనిలో బిజీగా ఉన్నాయి. ఏ ఆటగాడిని వదులుకోవాలి.. ఎవరిని జట్టులో ఉంచాలి..! అనే విషయాలపై తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులోనే ట్రేడ్ డీల్ కూడా భాగమై ఉండటంతో ఈ చర్చలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ సీజన్‌లో సీఎస్కే(CSK) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja)ను వదులుకుని.. రాజస్థాన్ రాయల్స్…

Read More

వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నిరాశ ఎదురైంది. కార్తిక మాసం కావడంతో స్వామి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులకు అధికారులు షాక్ ఇచ్చారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఈ తెల్లవారుజామున ప్రధాన ద్వారాన్ని ఇనుప రేకులతో పూర్తిగా మూసివేశారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో గత నెల రోజులుగా గుడి పరిసరాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దక్షిణ, ఉత్తర ప్రాకారాలు, నైవేద్య శాల, ఈవో కార్యాలయాన్ని తొలగించారు….

Read More

నెయ్యి మరక జగన్‌కే!..

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిని కల్తీ చేసిన వైనం చాలా స్పష్టంగా బయటపడింది. ఐదు సంవత్సరాల పాటు అసలు నెయ్యే కాని నెయ్యిని భోలోబాబా డెయిరీ సరఫరా చేస్తే కళ్లు మూసుకుని కొనుగోలు చేశారు. అప్పుడప్పుడు రిజెక్ట్ చేసినట్లుగా నటించడానికి కొన్ని రిజెక్ట్ చేసి.. అదే నెయ్యిని వేరే కంపెనీ పేరుతో మళ్లీ తీసుకున్నారు. ఇలాంటి విన్యాసాలన్నీ సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్టుతో స్పష్టమయ్యాయి. రాష్ట్రం కన్నా ఎక్కువగా దేశ స్థాయిలో సంచలనం…

Read More

పేదలకు పండుగ..

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 17 నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, ఒకేసారి గృహప్రవేశాలను చేయిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దేవగుడిపల్లి గ్రామంలో జరిగే సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేస్తారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన 3,00,192 ఇళ్లను ఒకేసారి ప్రారంభిస్తారు. పీఎంఏవై-బీఎల్సీ…

Read More

సనాతన ధర్మ బోర్డుకు ఇదే సరైన సమయం: పవన్ కల్యాణ్

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను గుర్తు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యిని వినియోగించినట్లుగా సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ స్పష్టం చేసిన అంశంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ న్యూస్ రిపోర్టును షేర్ చేసిన ఆయన .. మరో ట్వీట్ తన అభిప్రాయాలు వెల్లడించారు. తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే.. తినుబండారం కాదన్నారు. తిరుమలకు ఏటా రెండున్నర కోట్ల మంది వస్తారని.. తిరుమల…

Read More

బీఆర్ఎస్: సోషల్‌మీడియాలో హైప్ – గ్రౌండ్‌లో డీలా!

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కాసేపటి వరకూ సోషల్ మీడియాలో హడావుడి చేసిన బీఆర్ఎస్ సైనికులు తర్వాత ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం, రిగ్గింగ్ అంటూ ప్రచారం ప్రారంభించారు. ఆ పార్టీ బలం, బలహీనత సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం ఉద్ధృతంగా చేయడమే. కానీ గ్రౌండ్ లో మాత్రం ఆ ప్రచారం ప్రభావం ఎంత అన్నది మాత్రం వారు అర్థం చేసుకోలేకయారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను…

Read More

భారత్ లో ఇకపై మిగిలేది నాలుగు ప్రధాన బ్యాంకులే..

భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ మరోసారి ప్రధాన మార్పు దిశగా పయనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల విలీనం రెండో దశ (Bank Merger 2.0) కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే దేశంలో కేవలం నాలుగు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), మరియు నరా బ్యాంక్…

Read More

ప్రధాని మోదీ రహస్యాలన్నీ అమిత్ షాకు తెలుసు..

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటనలో కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర భారతదేశంలో అత్యంత అసమర్థ హోం శాఖ మంత్రిగా అమిత్ షాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అభివర్ణించారు. దేశంలో గత కొన్నేళ్లుగా జరిగిన భద్రతా…

Read More