Satish Sampath

శ్రీ చరణికి చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్

మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది! పురుషుల జట్టు ఎన్నో విజయాలు సాధించినా, మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుంది. ఈ అద్భుత విజయంతో టీమిండియా క్రికెటర్లు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షంలో తడుస్తున్నారు. బీసీసీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచినది ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లా అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణి. వరల్డ్ కప్‌లో తన అద్భుత బౌలింగ్‌తో భారత…

Read More

పశువుల హాస్టల్

ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. మనకు తెలిసే సరికి “ఇలా కూడా జరుగుతుందా?” అని ఆశ్చర్యపోతాం. అలాంటి ఒక అద్భుతం ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో చోటుచేసుకుంది — అక్కడ మనుషులకోసం కాదు, పశువుల కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఉంది! సాధారణంగా హాస్టల్ అంటే విద్యార్థులు లేదా ఉద్యోగులు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పశువులే అతిథులు. పెళ్లిళ్లు, వేడుకలు లేదా ఇతర కార్యక్రమాల కోసం యజమానులు తమ ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లాల్సి వస్తే, పశువుల…

Read More

ఉపఎన్నికలో మద్దతుపై తేల్చేసిన చంద్రబాబు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరుల ఓట్ల కోసం అన్ని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే, టీడీపీ అధిష్ఠానం మాత్రం తన వైఖరిని స్పష్టంగా తెలిపింది — బీజేపీ మద్దతు అడిగితే సపోర్ట్ చేయాలి, లేకుంటే తటస్థంగా ఉండాలి అని తెలంగాణ టీడీపీ నేతలకు సూచించింది. ఇంతవరకు బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక మద్దతు అభ్యర్థన రాకపోవడంతో, టీడీపీ నేతలు కూడా బహిరంగంగా ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఈ పరిస్థితి జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలను మరింత…

Read More

బండి సంజయ్ అవుట్… కిషన్ రెడ్డి ఇన్! జూబ్లిహిల్స్‌లో బీజేపీ కొత్త వ్యూహం

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. పార్టీ తరపున మొదట లీడ్ తీసుకున్న బండి సంజయ్ హఠాత్తుగా సైలెంట్ అయ్యారు. ఆయన స్థానంలో ఇప్పుడు కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. బండి సంజయ్ మాత్రం ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. మొదట్లో మజ్లిస్, కాంగ్రెస్‌లపై తనదైన ధాటితో బండి సంజయ్ దాడి చేయడంతో బీజేపీకి ఊపొచ్చిందని అనిపించింది. కానీ అదే ధోరణి బీజేపీ హైకమాండ్‌కు నచ్చలేదని సమాచారం. ఆయన దూకుడు తగ్గించాలని,…

Read More

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీకి జనసేన, టీడీపీ మద్దతు లేదా..?

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ బరిలో ఉన్నా, ఆ పార్టీ విజయం కోసం పెద్దగా కసరత్తు చేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగమై ఉన్నా, బీజేపీ నేతలు ఇప్పటి వరకు చంద్రబాబుని గాని, టీడీపీ ప్రధాన నేతలను గాని సంప్రదించకపోవడం గమనార్హం. టీడీపీకి కొంత బలం ఉన్న ప్రాంతం జూబ్లిహిల్స్‌లో మద్దతు కోరకపోవడం రాజకీయంగా బీజేపీకి ప్రతికూలంగా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు….

Read More

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచరమ్మ

శ్రీకాకుళం జిల్లా, మెళియాపుట్టి మండలం, బందపల్లిలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పాఠశాలలో హెచ్ఎమ్‌గా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సుజాత, దర్జాగా కుర్చీలో కూర్చొని, సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ… ఇద్దరు విద్యార్థినుల చేత తన కాళ్లు నొక్కించుకున్నారు. వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, ఈ వీడియో విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. విద్యార్థులను పనుల్లో పెట్టడం, అమానవీయంగా ప్రవర్తించడం వంటి చర్యలను ఉపేక్షించేది లేదని…

Read More

పద్ధతి మార్చుకోని రాజేంద్రప్రసాద్… మళ్లీ వివాదాల దారిలో!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దశాబ్దాలుగా వినోదానికి చిరునామాగా నిలిచిన నటుడు రాజేంద్రప్రసాద్, గత కొంతకాలంగా తన ప్రవర్తనతో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.యువకుడిగా ఉన్నప్పుడు హుందాతనం, పద్ధతి, మాట్లాడే తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. అయితే తాజాగా ఆయన మాట్లాడే విధానం, స్టేజ్‌పై ప్రవర్తన — పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ఇటీవల నితిన్–శ్రీలీల జంటగా నటించిన “రాబిన్‌హుడ్” ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి.ఆ సినిమా స్పెషల్…

Read More

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్ర వర్షాలు, వరదల ముప్పు తలెత్తిన జిల్లాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటనకు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్న సీఎం చంద్రబాబు —బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల వరద ప్రభావిత ప్రాంతాలపై విస్తృతంగా పరిశీలన చేయనున్నారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ అనంతరం,కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో…

Read More

కట్టు బొట్టు మార్చిన కవిత…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత, బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన రాజకీయ పయనాన్ని కొత్త కోణంలో ప్రారంభించారు.ఇటీవల ఆమె కనిపిస్తున్న కట్టు, బొట్టు, ఆహార్యం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రజా సమక్షంలో ఆమె కొత్త లుక్, కొత్త భాషణ శైలి చూస్తుంటే, తమిళనాడు రాజకీయ చరిత్రలో ‘అమ్మ’గా పేరుగాంచిన జయలలితను తలపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ మార్పు కేవలం సౌందర్య పరమైనదేనా?లేక జయలలిత తరహాలో బలమైన మహిళా నాయకురాలిగా ఎదగాలన్న వ్యూహాత్మక…

Read More

జూబ్లీహిల్స్ గెలుపు కోసం సీతక్క

ఒకవైపు కీలకమైన మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచార వ్యూహాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.బోరబండ, యూసుఫ్‌గూడ, వెంగళరావు నగర్ వంటి పేద, మధ్యతరగతి ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడుపుతూ ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజల మధ్య కలిసిపోతూ, టీ దుకాణంలో దోసెలు వేయడం, ఓ గృహిణి ఇంట్లో బియ్యం చెరగడం వంటి దృశ్యాలు ఆమె వినయాన్ని, ప్రజలతో సాన్నిహిత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. పగలు ఇంటింటి ప్రచారం,…

Read More