News
ట్రంప్ టారిఫ్‌లపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన టారిఫ్‌లను రద్దు చేసింది. అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం లేదు, స్టాక్ మార్కెట్లు లాభాల్లో, అంతర్జాతీయ వ్యాపారం ప్రభావితమవుతుంది… అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పులో, ట్రంప్ విధించిన పలు దేశాలపై టారిఫ్‌లను రద్దు చేసి, అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం లేదని స్పష్టం చేసింది; ఈ తీర్పు ప్రకారం ట్రంప్ ఇప్పటివరకు వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది, దీని ప్రభావంతో US స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి, 6…
ఇమ్రాన్ ఖాన్ కు కంటిచూపు పోయే ప్రమాదం..
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన కుడి కంటిలో సమస్య తీవ్రమైందని, వెంటనే సరైన చికిత్స అందించకపోతే చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉందని పీటీఐ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జైలు అధికారులు వైద్యుల సూచనలను పట్టించుకోకుండా… ఇమ్రాన్ కు జైల్లోనే చికిత్స చేయాలని పట్టుబట్టడంతో పరిస్థితి మరింత దిగజారిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇమ్రాన్ ఖాన్…
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఈ ఉదయం ముంబై నుంచి…
తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో దట్టమైన పొగమంచు
తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో దట్టమైన పొగమంచుతెలంగాణలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. దీని…
ట్రంప్‌కు మోదీ బానిస: నారాయణ
ట్రంప్‌కు మోదీ బానిస: నారాయణతెలంగాణ : ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ భయపడుతున్నారని, ఇతర దేశాలపై అమెరికా దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే చరిత్ర ఉందని, ఆర్ఎస్ఎస్ కు చరిత్ర లేదని ప్రశ్నించారు. సీపీఐ జాతీయ నేత కె.నారాయణ మాట్లాడుతూ మోదీ ట్రంప్‌కు బానిసగా వ్యవహరిస్తున్నారని, కార్పొరేట్ కంపెనీలకు భారీ…
ఉద్యోగులకు గుర్తింపు నిబద్ధతతోనే: ప్రొఫెసర్ కోదండరాం
ఉద్యోగులకు గుర్తింపు నిబద్ధతతోనే: ప్రొఫెసర్ కోదండరాంతెలంగాణ : విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తేనే ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వార్డ్ ఆఫీసర్లు తమ పే స్కేల్‌ను సవరించి, జూనియర్ అసిస్టెంట్ పే స్కేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రస్థాయి హడక్ కమిటీని కూడా ఏకగ్రీవంగా…
అదిత్య-L1 డేటా విశ్లేషణకు శాస్త్రవేత్తలకు ISRO ఆహ్వానం.
భారతదేశ తొలి సౌర పరిశోధనా మిషన్ అదిత్య-L1 రెండో వార్షికోత్సవం సందర్భంగా, శాస్త్రీయ పరిశోధనలకు మరింత ఊపునిచ్చే కీలక ప్రకటన చేసింది ఇస్రో. అదిత్య-L1 మిషన్ ద్వారా సేకరించిన డేటా విశ్లేషణ కోసం భారతీయ శాస్త్రవేత్తల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ అనౌన్స్‌మెంట్ ఆఫ్ ఆపర్చునిటీ (AO) విడుదల చేసింది.ప్రస్తుతం అదిత్య-L1 మిషన్‌కు సంబంధించి 23 టెరాబైట్లకు పైగా డేటా పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉందని, ఇప్పటికే అనేక కీలక శాస్త్రీయ ఫలితాలు అంతర్జాతీయ పియర్-రివ్యూడ్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయని…
ఇండియన్ ఆర్మీలోకి ‘భైరవ్’ సేన..!
ఆధునిక యుద్ధతంత్రంలో భారత్ మరో ముందడుగేసింది. పాక్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం ‘భైరవ్’ పేరుతో అత్యంత శక్తిమంతమైన ఫోర్స్ను రంగంలోకి దించింది. ఈ దళం కోసం లక్ష మందికి పైగా ‘డ్రోన్ ఆపరేటర్లను’ సిద్ధం చేసింది. సాధారణ సైన్యానికి, స్పెషల్ ఫోర్సెస్కు మధ్య వారధిలా పనిచేసే ఈ భైరవ్ కమాండోలు శత్రువుల స్థావరాలను డ్రోన్ల సాయంతో క్షణాల్లో నేలమట్టం చేయగలరు.
తిరుపతి: మద్యం మత్తులో ఆలయంలోకి చొరబాటు… కలకలం
తిరుపతిలోని టిటిడి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది.మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయంలోకి చొరబడాడు.విజిలెన్స్ సిబ్బంది గమనించేలోపే ఆలయ గోడ దూకి లోపలికి ప్రవేశించిన ఆ వ్యక్తి,మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయ గోపురాన్ని ఎక్కాడు.గోపురం పైకి చేరుకున్న అతడు కలశాలను లాగేందుకు ప్రయత్నించడంతో భక్తులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.ఆ వ్యక్తిని **తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మవాడ, పెద్దమల్లా రెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతి (45)**గా పోలీసులు…
మహిళా సంఘాలకు శుభవార్త..
మహిళా సంఘాలకు శుభవార్త.. కొత్త పథకం ప్రారంభం.. 70 శాతం సబ్సిడీ.. ప్రతి నెలా డబ్బులు. కొత్త ఏడాది ప్రారంభంలోనే మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి కోసం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకువచ్చింది. దీని ద్వారా మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెలా ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా 70 శాతం సబ్సిడీతో రెండు పాడి గేదెలు/ఆవులు అందిస్తారు. రాష్ట్రంలో పాల కొరత తీర్చడంతో పాటు మహిళా సాధికారత,…

