నాడు రాజకీయ శిక్షణ కేంద్రం… నేడు విలువల విద్యకు చిరునామా గండిపేట
Chandrabau appriates StudentsTeachers
Chandrabau appriates StudentsTeachers
తెలంగాణ కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుల ప్రకటన అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది. డీసీసీ పీఠం ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ ముఖ్యనేతల తీరుపై రుసరుసలాడుతున్నారు. పార్టీని నమ్ముకుని పని చేస్తే ఇదా మాకు మీరిచ్చే గౌరవం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సామాజిక వర్గాలను పక్కన పెట్టడం చర్చకు దారితీస్తోంది. పొలిటికల్ పార్టీలలో సామాజిక సమీకరణాలు చాలా కీలకం. అలాంటిది ఉత్తర తెలంగాణలో రాజకీయంగా చైతన్యం కలిగిన.. వెలమ సామాజిక వర్గానికి ఈ…
రాజకీయ రంగంలో రాజకీయ ప్రముఖులు కలవడం సహజమే. కానీ కొంతమంది కలయిక మాత్రం రాజకీయాలను షేక్ చేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్ భేటీ అలాంటి పరిస్థితులనే తలపిస్తోంది. ఇంతకీ వీరి భేటీ దేనికి సంకేతం..? భేటీలో ఏ మాట్లాడుకున్నారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొన్నేళ్లు ముందు వరకు వైయస్ జగన్, కేటీఆర్ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించారు. అధికారం, మందీ మార్భలంలో…
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా పాలన వారోత్సవాలను ఘనంగా నిర్వహించి.. గ్రామాల్లో పెండింగ్ పథకాలు ఏమైనా ఉంటే ఇచ్చేసి.. వెంటనే ఎన్నికలు పెట్టబోతున్నారు. ప్రజా పాలన వారోత్సవాలు డిసెంబర్ 9న ముగియనున్నాయి. ఆ తర్వాత రెండు రోజులకే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగేలా షెడ్యూల్ రానుంది. ఐదు రోజుల గ్యాప్ తో మరో రెండు విడుతలు పెట్టి పంచాయతీలకు కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేస్తారు. అంటే…
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వెన్నుపోటు పొడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో హరీశ్‌రావు–కవిత మధ్య వార్ మరోపారి చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. కవిత మెదక్‌లో చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్ నేతలు స్పందించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్ అని.. కానీ కవిత కారణంగానే పార్టీ…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరగడంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యూ,లో బుధవారం రాత్రి అత్యంత కనిష్ఠంగా 10.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి హెచ్‌సీయూ ప్రాంతంలో 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో సగటున…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు వేగంగా కొనసాగుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదిక సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో మరో పాత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది — 2014లో రాష్ట్ర విభజన సమయంలో విలీనమైన భద్రాచలం పరిధిలోని ఐదు గ్రామాల అంశం. ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ మరోసారి గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాజకీయ వేదికలపై తన ఆత్మవిశ్వాసంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. తన పాలనపై ఉన్న విశ్వాసం అంతగా ఉందని, “మరోసారి కూడా సిఎం నే అవుతాను” అని ఆయన ఖచ్చితంగా చెబుతున్నారు. తాజాగా రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా జరిగిన ‘మీట్ ది ప్రెస్’ సమావేశంలో కూడా అదే ధైర్యవచనం పునరావృతం చేశారు. “రాయించుకోండి… తర్వాత టర్మ్ కూడా నా దే” అని జర్నలిస్టులకే సవాల్ విసిరిన రేవంత్, ఈ మాటను గతంలోనూ…
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరుల ఓట్ల కోసం అన్ని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే, టీడీపీ అధిష్ఠానం మాత్రం తన వైఖరిని స్పష్టంగా తెలిపింది — బీజేపీ మద్దతు అడిగితే సపోర్ట్ చేయాలి, లేకుంటే తటస్థంగా ఉండాలి అని తెలంగాణ టీడీపీ నేతలకు సూచించింది. ఇంతవరకు బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక మద్దతు అభ్యర్థన రాకపోవడంతో, టీడీపీ నేతలు కూడా బహిరంగంగా ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఈ పరిస్థితి జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలను మరింత…
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. పార్టీ తరపున మొదట లీడ్ తీసుకున్న బండి సంజయ్ హఠాత్తుగా సైలెంట్ అయ్యారు. ఆయన స్థానంలో ఇప్పుడు కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. బండి సంజయ్ మాత్రం ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. మొదట్లో మజ్లిస్, కాంగ్రెస్‌లపై తనదైన ధాటితో బండి సంజయ్ దాడి చేయడంతో బీజేపీకి ఊపొచ్చిందని అనిపించింది. కానీ అదే ధోరణి బీజేపీ హైకమాండ్‌కు నచ్చలేదని సమాచారం. ఆయన దూకుడు తగ్గించాలని,…